అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. భేటీలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి , పరిపాలనాపరమైన సమస్యలు, రాష్ట్ర భద్రతా అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ముఖ్యంగా విభజన చట్టంలోని హామీల అమలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు , కేంద్ర ప్రభుత్వం నుండి అందాల్సిన సహకారంపై పవన్ కల్యాణ్ వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు, రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమ పథకాలకు కేంద్ర […]